సన్నాసి మంత్రులు మందులో సోడా పోసెతందుకు పనికివస్తుండ్రు : రేవంత్‌రెడ్డి

/
0 Comments
Revanth Reddy

‘‘వంద అంతస్తుల బంగళాలు కడతా, ఫ్లైఓవర్లు కడతా, విమానాలు తెస్తా, మీ ఊర్లకు అవి తెస్తా, మీకు నీళ్లు తెస్తా.. మన్ను తెస్తా, మశానం తెస్తా అని చెబుతున్నడు. కనీసం రెండు గంటలు కరెంటు ఇయ్యవయ్యా మగడా అని మేం అడుగుతున్నం. పలికిండా..! కనీసం సచ్చిపోయిన కుటుంబాలను పిలిచి ఎంతోకొంత ఇయ్యి. కనీసం 10 లక్షలు ఇయ్యి. కనీసం నీ దగ్గర 10 పదకొండు మంది మంత్రులున్నరు. ఓ ముగ్గురు నలుగురు మరీ చవటలున్నా, ఆరేడుగురు సన్నాసులను సచ్చిపోయినోళ్ల దగ్గరికి పంపించమని మేం అడుగుతున్నం. ఈ సన్నాసి మంత్రులు ఫాంహౌస్‌లో ఆయనకు మందులో సోడా పోసెతందుకు పనికివస్తుండ్రు తప్ప, సచ్చిపోతున్న మన దగ్గరికి రావడానికి పనికివస్తలేరు. ఇంతకన్నా సన్నాసులు ఎవడన్న మంత్రులు ఉంటరా అని నేను అడుగుతున్నా.


 ఒకనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎవడు సచ్చిపోయినా ఏ ఊళ్లో సచ్చిపోయినా ఓ జెండా ఏసుకొని, ఓ కండువా ఏసుకొని రయ్యరయ్య కార్ల అక్కడికి పోయి వాళ్ల మీద గప్పి కన్నీళ్లు పెట్టిన సన్నాసులు.. ఈ రోజు ఎందుకు వస్తలేరు రైతులు సచ్చిపోతే అని నేను అడుగుతున్నా!’’ - ఽఽధర్నాలో రేవంత్‌రెడ్డి


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.