వైకాపా ఖాళీ అయిపోతోంది!!!

/
0 Comments
విశాఖ జిల్లాలో వైకాపా ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీకి చెందిన నాలుగు నియోజకవర్గాల నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 17న విశాఖ వస్తున్న చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరంతా టిడిపిలో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. వైకాపా నుంచి ఇంతమంది మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. వైకాపాను ఖాళీ చేయించాలన్న లక్ష్యంతో ముందుకు టిడిపి నేతలు కదులుతున్నారు. ఇప్పటికే అరకు ఎంపి కొత్తపల్లి గీత వైకాపా అధినేత జగన్‌తో విబేధించి, తెలుగుదేశం, బిజెపి సరసన చేరిపోయారు. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ జగన్ బయటకు వచ్చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచి కాంగ్రెస్ అథిష్ఠానాన్ని కూడా కాదని సబ్బం హరి, జగన్‌కు భుజం కాశాడు. చివరికి ఆయన కూడా జగన్‌కు దూరమైపోయారు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలలో వైకాపా తరఫున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, కోలా గురువులు కూడా వైకాపాకు దూరం కాబోతున్నారు. అలాగే విశాఖ లోక్‌సభ పరిధిలో ఉన్న ఎస్ కోట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బోకం శ్రీను కూడా వైకాపా నుంచి బయటకు వచ్చేయనున్నారు. వీరంతా శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి సుదీర్ఘ మంతనాలు సాగించారు.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.