చంద్రబాబు గారు నాకు ముందే చెప్పారు - నాకు నమ్మకం ఉంధి - నారా రొహిత్

/
0 Comments

Chandrababu Naidu with Nara Rohith
                        టాలీవుడ్‌లో అగ్ర హీరోలు నటించిన 7వ సినిమాలన్ని సూపర్‌హిట్ అయ్యాయి. పవన్ – ఖుషీ, మహేష్-ఒక్కడు, ఎన్టీఆర్-సింహాద్రి,ఛెర్రీ-ఎవడు ఇలా వరుసపెట్టి అన్ని సినిమాలు హిట్ కొట్టాయి. ఇప్పుడు నారా వారి వారసుడు నారా రోహిత్ హీరోగా నటిస్తున్న రౌడీఫెలో చిత్రం కూడా ఆయనకు 7వ సినిమా కానుంది. దీంతో తమ సినిమా తప్పకుండా ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం హిట్ అవుతుందన్న నమ్మకంతో రౌడీఫెలో చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. నారా రోహిత్-విశాఖసింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
                        ఈ సినిమాతో గీత రచయిత దంతులూరి చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రం హిట్ అయ్యేందుకు మరో సెంటిమెంట్ కూడా ఉందని చిత్రబృందం చెపుతోంది. రోహిత్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు చంద్రబాబు హాజరైన సోలో, ప్రతినిధి సినిమాలు హిట్ అయినట్టే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. అలాగే గతంలో నందమూరి హీరోలైన ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన 7వ సినిమాలు కూడా హిట్ అయ్యాయని.. ఇప్పుడు అదే సెంటిమెంట్ రోహిత్‌కు కూడా వర్తించి ఈ సినిమా హిట్ అవుతుందని అప్పుడే చంద్రబాబు చెప్పారు. దీంతో ఇలా అన్ని సెంటిమెంట్లు ఫలించి రౌడీఫెలో సూపర్‌హిట్ అవుతుందన్న ధీమాతో చిత్రబృందం ఉంది.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.