నాది తెలుగు దెశం, నెను తెలుగు వాడిని!!!

/
0 Comments
ఎన్నికలకు ముందు తేదేపాతో పాటు చంద్రబాబు అంటీముట్టనట్టు వ్యవహరించిన జూనియర్ ఆ ఎన్నికల్లో తేదేపాకు ప్రచారం చేయకుండా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత జూనియర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎన్నికలకు ముందు వచ్చిన రామయ్యావస్తావయ్యా చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా రూ.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఎన్నికల తర్వాత వచ్చిన రభస డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా రూ.25-30 కోట్ల మధ్యలోనే ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌, పూరిల కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా గోవాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. జనవరి 9న సినిమా విడుదలకు ప్లాన ‌చేస్తోన్న ఈఇద్దరూ ఇప్పుడు ఆడియో విడుదలపై దృష్టిపెట్టారట. డిసెంబర్‌ 20న పాటలు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. స్వర్గీయ ఎన్టీఆర్‌ స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ తన కొత్త సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడట.
గత ఎన్నికలలో కృష్ణాజిల్లాలో ఎదో ఒక స్థానం నుండి పొటీ చేద్దామని తీవ్రంగా ప్రయత్నించి భంగ పడ్డ తన తండ్రి హరికృష్ణను కూడా ఈ ఆడియో వేడుకకు తీసుకు వచ్చి తద్వారా తన రేంజ్‌ ఏంటో చూపించాలనుకుంటున్నాడట . మరోవైపు ఈ సినిమాలో జూనియర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీ ఇప్పటి వరకు చూడనివిధంగా చాల డిఫరెంట్ గా ఉండబోతోందని టాక్. ఈ సినిమాకు ‘సంషేర్’ అనే టైటిల్ ను నిశ్చయించి ఈ నెలలోనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని ఫిలింనగర్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నందమూరి అభిమానుల్లో చాలా మంది ఎన్టీఆర్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వారి అండదండలు ఉండాలి అంటే తప్పక పసుపుజండా కిందికి రావాల్సిందే అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొన్న జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సభత్వ నమోదుకు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రావడమే ఇందుకు తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఇకనుండి అంతా కలిసి పనిచేసుకుందాం అనే భావన హరికృష్ణ లో కూడా వచ్చినట్లు కనపడుతుంది. మొత్తానికి నందమూరి అభిమానులు అందరు ఈ శుభవార్త విని పండగ చేసుకోవడం కాయం.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.