నారా లొకేషపై టీఆర్ఎస్ నాయకులు కేసు!!!

/
0 Comments
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పై టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత రామనర్సింహ గౌడ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ నారా లోకేష్ ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో రెండు ట్వీట్లు పెట్టారు. అసలు రౌడీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ లా పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఎకనమిక్ ఫోరంలో ప్రమోట్ చేయడంలో బిజీబిజీగా గడుపుతుంటే.. కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.