రేవంత్ చెప్పింది నిజమే.. హిందూ కథనం

/
0 Comments
Revanth Reddy against MP.Kavitha
                      సమగ్ర సర్వే అంశం తెరాస సర్కారుకు బూమ్ ర్యాంగ్ అవుతోంది. ఎంపీ కవిత రెండు చోట్ల తన వివరాలు నమోదు చేసుకున్నారన్న విషయంపై కేసీఆర్ కి తలపోట్లు తప్పడం లేదు. రేవంత్ రెడ్డి లేవనెత్తి ఈ అంశం రెండు రోజులుగా శాసనసభను స్తంభింపజేసింది. చివరికి తెదేపా సభ్యుల సస్పెన్షన్ కు కారణమైంది. అయితే ఈ రోజు ఈ అంశంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది.
                  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనంటూ ద హిందూ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. కవిత నిజామాబాద్ లో తన వివరాలు నమోదు చేయించుకుందని ఆ పత్రిక చెప్పింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని అందువల్ల తాను రాకపోయినా నిజామాబాద్లో తన వివరాలు నమోదు చేయాలని కవిత రాసిన లేఖను ఆమె మామ రామకృష్ణారావు అక్కడి ఎన్యుమరేటర్ కు అందజేశారు. దీంతో ఆగస్టు 19 ఆమె పేరును నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో నమోదు చేశారు. నవీపేట మండల తహశీల్దార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారని హిందూ పేర్కొంది. అయితే సర్వే రోజున కవిత తన తమ్ముడు కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ లో సర్వేలో పాల్గొన్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఈ రెండు అంశాలను పరిశీలిస్తే రేవంత్ చెప్పింది నిజమేనని హిందూ పత్రిక పేర్కొంది.
                       రేవంత్ కూడా ఈ ఆధారాలకు సంబంధించిన వివరాలను సీడీ రూపంలో స్పీకర్ కు అందజేశారు. మరి కళ్ల ముందు నిజాలు స్పష్టంగా కనబడుతుంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆ సక్తి కరంగా మారింది. సాక్ష్యాల ప్రకారం చర్య తీసుకుని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా లేక కేవలం అధికార పార్టీ సభ్యుడిగానే వ్యవహరిస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.