మహేష్ బాబు కి ఆఫర్ ఇచ్చింది ఎవరు???

/
0 Comments
Mahesh Babu
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ సైతం ప్రిన్స్ మహేష్ బాబుపై కామెంట్ విసరటానికి సాహసించరు. ఎందుకంటే తనతో నటించేందుకు ఆఫర్ వస్తే చాలు అనుకునే హీరోయిన్స్ ఉన్నారు కాని, తనపై కామెంట్స్ చేసే సీన్ వారికి ఉండదని వారి అర్ధం. ఇదిలా ఉంటే ఓ బ్యూటీ ఏకంగా మహేష్ బాబుతో డేటింగ్ సిద్ధం అంటూ కామెంట్ విసిరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

 
                                 అయితే ఈ కామెంట్ చేసింది మాత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్ కాదు. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ విధమైన కామెంట్ చేసింది. బ్లాక్ బస్టర్ ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆ తర్వాత దాదాపు తను చేసిన అన్ని సినిమాలు 100 కోట్ల మార్క్ దాటేయడంతో బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న సోనాక్షి మొదటి సారి సౌత్ ఇండియాలో చేసిన సినిమా ‘లింగ’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. 
                             అయితే సోనాక్షి తన స్టార్ డంని సౌత్ మార్కెట్ లోనూ పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు ఒప్పుకోవటానికి ఇక నుండి సమయాన్ని కేటాయిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబు, సూర్య, రవితేజలతో కలిసి నటించాలనుకుంటున్నానని’ సోనాక్షి తెలిపింది. అంతే కాకుండా సౌత్ లో ఏ హీరోకి డేటింగ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మహేష్ బాబు పేరుని చెప్పుకొచ్చింది. సోనాక్షి ఇచ్చిన ఈ ఆఫర్ ని మహేష్ ఏ విధంగా ఉపయోగించుకుంటాడో చూడాలి మరి అని టాలీవుడ్ అంటుంది.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.