బాలకృష్ణ 'గాడ్సే' చిత్రం స్టోరీ లైన్.

/
0 Comments
నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గాడ్సే అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.



సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బాలకృష్ణపై ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు మీడియా నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన 'సీతారామకల్యాణం', 'బొబ్బిలిసింహం', 'తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.