‘ఆగడు’ టికెట్‌న ఏకంగా 1500 డాలర్లు

/
0 Comments
                       

మహేష్ బాబు “ఆగడు” మ్యానియాకు సంబంధించి వస్తున్న వార్తలు వింటూ ఉంటే ఒక మనిషి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయo. మహేష్ ‘ఆగడు’ సినిమాను మొదటిరోజు మొదటి ఆట చూడడానికి ప్రిన్స్ అభిమానులు రూపాయలను చిత్తు కాగితాలులా విసిరి వేయడం నమ్మలేని నిజంగా మారింది.  తెలుస్తున్న సమాచారం మేరకు అమెరికాలోని మిచిగాన్‌లో ఆగడు ఫస్ట్ టికెట్ వేలం పాట నిర్వహించారు అని వార్తలు వస్తున్నాయి. ప్రనీష్ రెడ్డి అనే ఒక మహేష్ వీరాభిమాని ‘ఆగడు’ టికెట్‌ను ఏకంగా 1500 డాలర్లు(దాదాపు రూ. 90 వేలు) కు సొంతం చేసుకున్నాడు అనే వార్తలు టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ లా మారాయి. అదేవిధంగా ‘ఆగడు’ రెండో టికెట్‌ను హిరేన్ రెడ్డి అనే అభిమాని 1000 డాల్లర్లకు సొంతం చేసుకున్నాడట. ఇది ఇలా ఉండగా అమెరికాలోని మిచిగాన్ లోని నోవి లొకేషన్లో ఆగుడు చిత్రాన్ని ఐమాక్స్ స్క్రీన్ పై ప్రదర్శింప బోతున్నారు. ఈ భారీ స్క్రీన్ పై ప్రదర్శింప బడుతున్న తొలి తెలుగు సినిమాగా ‘ఆగడు’ రికార్డుకు ఎక్కుతోంది.

                      అంతేకాకుండా మిచిగాన్ ప్రాంతంలో 7 లొకేషన్లలో ‘ఆగడు’ సినిమా విడుదల అవుతోంది. దీనితో పాటు 4 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు అనే వార్తలు కూడ వస్తున్నాయి. వస్తున్న ఈ వార్తలను బట్టి ‘ఆగడు’ పై పెరిగిపోయిన అంచనాలను తెలుపుతోంది. ‘ఆగడు’ రిజల్ట్ బయటకు రాకుండానే వస్తున్న ఈ కలెక్షన్స్ సునామి చూస్తూ ఉంటే అనుకున్న విధంగా ‘ఆగడు’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏ రేంజ్ కి వెళుతుందో అంచనాలకు కూడ అందని విధంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.